జాతకంలో దోషాలా? శనివారం ఆ చెట్టుకు పూజ చేస్తే అంతా సెట్! - Puja For Shani Shanti - PUJA FOR SHANI SHANTI

 

జాతకంలో దోషాలా? శనివారం ఆ చెట్టుకు పూజ చేస్తే అంతా సెట్! - Puja For Shani Shanti - PUJA FOR SHANI SHANTI



Jammi Chettu Puja Benefits In Teluguసహజంగా మన ఇంట్లో మనకు తెలియకుండానే కొన్ని వాస్తు దోషాలు ఉంటాయి. తెలిసో తెలియకో జరిగే ఈ తప్పులకు పరిహారంగా ఇంట్లో జమ్మిచెట్టును పెంచుకుంటే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జమ్మి చెట్టు శనీశ్వరుడికి సంబంధించినదిగా తెలుస్తోంది. ఇంట్లో సానుకూల శక్తుల కోసం మనం అనేక రకాల మొక్కలను పెంచడం సర్వ సాధారణం. అయితే శనీశ్వరుడి చెట్టుగా భావించే జమ్మి చెట్టును ఇంట్లో పెంచుకోవడం వలన మన ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయని విశ్వాసం.

జమ్మి చెట్టు ఎక్కడ నాటాలంటే?
వాస్తు శాస్త్రం సూచించిన ప్రకారం శమీ చెట్టును ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున నాటితే శుభకరమని తెలుస్తోంది. ఒకవేళ ప్రధాన ద్వారం వద్ద జమ్మిచెట్టుని నాటడానికి సరిపడా స్థలం లేకపోతే మేడమీద దక్షిణం వైపు జమ్మి చెట్టును నాటడం సకల శుభాలను ఇస్తుందని శాస్త్ర వచనం.

జమ్మి చెట్టు ఏ రోజు నాటితే మంచిది?
వాస్తు శాస్త్రం ప్రకారం జమ్మిచెట్టును విజయదశమి రోజు నాటడం అత్యుత్తమం. కాదంటే శనివారం రోజు జమ్మి చెట్టును నాటవచ్చు. శనివారం జమ్మి చెట్టును నాటడం వలన శనీశ్వరుని అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

జమ్మిచెట్టును ఎలా పూజించాలి?
సానుకూల శుభ ఫలితాల కోసం నిత్యం జమ్మి చెట్టుకు నీరు పోసి సంరక్షించాలి. క్రమం తప్పకుండా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, పసుపు కుంకుమలతో పూజించాలి. సాయం సంధ్యా సమయంలో జమ్మి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని వలన కలిగే దుష్ప్రభావాలు పోతాయని విశ్వాసం.




Comments

Popular posts from this blog

వాణిజ్య వశీకరణ యంత్రం

మీరు ఎలా కుబేరులు కావాలి అంటే ఈ మంత్రిని జపిచండి

కన్ను దిష్టి తగిలితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.. నివారించే పద్ధతులు ఇవే?