"ఇలా చేస్తే ఎంతటి నరదిష్టి అయినా - మిమ్మల్ని ఏమీ చేయలేదు!" - How to Get Rid from Nara Drishti - HOW TO GET RID FROM NARA DRISHTI

 

"ఇలా చేస్తే ఎంతటి నరదిష్టి అయినా - మిమ్మల్ని ఏమీ చేయలేదు!" - How to Get Rid from Nara Drishti - HOW TO GET RID FROM NARA DRISHTI



నరదిష్టిని చాలా మంది నమ్ముతారు. ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందనీ.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో మీరు నరదిష్టి బారినపడకుండా ఉండాలన్నా, లేదా ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నా.. ఈ పరిహారాలు పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. వాటిని ఫాలో అవ్వడం ద్వారా ఎంత దృష్టి శక్తినైనా ఇట్టే తొలగించుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం.

సముద్ర జలాలకు నరదిష్టి పోగొట్టే శక్తి ఉందట. కాబట్టి.. ఎవరైనా సరే వీలైనప్పుడు శుక్రవారం లేదా శనివారం సముద్ర తీరానికి వెళ్లి ఆ జలాలను ఒక బాటిల్​లో తెచ్చుకోండి. మీరు వ్యాపారం చేసే చోట, ఇంటి పరిసరాల్లో కానీ వాటిని చల్లండి. అలా చల్లడం ద్వారా ఆ ప్రాంతాలకు ఉన్న కను దిష్టి మొత్తం తొలగిపోతుంది. వ్యక్తులకు ఉన్న నరదిష్టి పోవాలంటే.. రోజూ కాస్త దొడ్డు ఉప్పు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నరదిష్టి పోగొట్టే శక్తి సాంబ్రాణి ధూపానికీ ఉంది. అమవాస్య లేదా పౌర్ణమి, అష్టమి, నవమి తిథుల్లో.. సాయంకాలం పూట ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఈ ధూపం వెయ్యాలి. ఎవరైతే ఇలా చేస్తారో వారు చాలా వరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

దృష్టి దోషం పోవాలంటే.. మంగళవారం ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా దొడ్డు ఉప్పును మూటకట్టి దాన్ని ఇంటి ముందు లేదా వ్యాపార స్థలం ముందు కానీ కట్టాలి. బుధవారం ఆ మూటను ఓపెన్ చేసి దానిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. లేదంటే.. పారే నీటిలో వదిలేయాలి. ఇలా ప్రతి మంగళవారం చేస్తుంటే.. ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉన్న మొత్తం కను దిష్టిని తొలగించుకోవచ్చు.

Comments

Popular posts from this blog

వాణిజ్య వశీకరణ యంత్రం

మీరు ఎలా కుబేరులు కావాలి అంటే ఈ మంత్రిని జపిచండి

కన్ను దిష్టి తగిలితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.. నివారించే పద్ధతులు ఇవే?