ఆ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు- కానీ కష్టపడి పనిచేస్తే విజయం తథ్యం- శివారాధన మేలు! -
- Get link
- X
- Other Apps
Horoscope Today June 11th 2025

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో అనుకున్న పనులు నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు ఉంటాయి. సంపూర్ణ విజయం కోసం శ్రమించాలి. కీలక నిర్ణయాలలో దూకుడు తగదు. బంధు మిత్రులతో ఆచితూచి నడుచుకోవాలి. ఉద్యోగులు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు తగ్గించుకోండి. శివారాధనతో శుభ ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ధనలాభాలున్నాయి. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప సమస్యలు ఉండవచ్చు. సన్నిహితుల సహకారం ఉంటుంది. మార్కెటింగ్ రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకంగా మారుతాయి. వృత్తి పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చితి నెలకొంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శనిధ్యానంతో ఆపదలు తొలగిపోతాయి.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. వృత్తి పరంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా అన్ని వైపులా నుంచి అనుకూలత ఉంది. ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేసి పదోన్నతులు పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సహృదయంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మీదే తుది నిర్ణయం అవుతుంది. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వశక్తితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో చిన్న చిన్న ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. విమర్శకుల మాటలు పట్టించుకోవద్దు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సుఖభోగాలు సొంతమవుతాయి. మనోధైర్యంతో అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. అధికారులతో కీలక చర్చలు ఫలిస్తాయి. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలించడానికి సమయం పడుతుంది. సహనంతో ఉండండి. కుటుంబంలో కొన్ని ఘటనలు బాధ కలిగిస్తాయి. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. శనిశ్లోకాలు చదువుకోవడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అధికారుల సహకారం ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలు, పరోపకార, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. దైవబలం అనుకూలిస్తోంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం జరుగుతుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

- Get link
- X
- Other Apps
Comments
Post a Comment