మోకాళ్ల నొప్పులు తగ్గించేందుకు బామ్మ చెప్పిన చిట్కా, నిముషాల్లోనే ఇంట్లో పెయిన్ రిలీఫ్ ఆయిల్ రెడీ
మోకాళ్ల నొప్పులు తగ్గించేందుకు బామ్మ చెప్పిన చిట్కా, నిముషాల్లోనే ఇంట్లో పెయిన్ రిలీఫ్ ఆయిల్ రెడీ
కీళ్ల నొప్పుల కోసం రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. కానీ..ఇంట్లోనే చాలా సులభంగా ఈ నూనె తయారు చేసుకోవచ్చు. పైగా మరీ ఎక్కువ పదార్థాలు అవసరం కూడా లేదు. నాలుగైదు ఇన్ గ్రీడియెంట్స్ తోనే ఇది రెడీ అయిపోతుంది. సరైన విధంగా వాడుకుంటే చాలా త్వరగా రిలీఫ్ వచ్చేస్తుంది.
కాస్త వయసు మీద పడిందంటే మోకాళ్ల నొప్పులు వచ్చేస్తాయి. నడవడమే ఇబ్బందిగా అనిపిస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తరవాత చేతి కర్ర లేనిదే నడవడం కష్టం. అక్కడి దాకా ఎందుకు. ఇప్పుడు చాలా త్వరగానే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. నాలుగు మెట్లు ఎక్కితేనే ఆయాస పడుతున్నారు. ఎముకల్లో బలం క్రమంగా తగ్గిపోతోంది. అయితే..ఇలా నొప్పి అనిపించిన ప్రతిసారీ ఏదో ఓ ఆయింట్ మెంట్ పూసి కాస్త మర్దన చేస్తుంటారు. దీని వల్ల కాస్త రిలీఫ్ వస్తుంది. ఇంకొంత మంది రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. అయితే..వీటి కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంట్లోనే పెయిన్ రిలీఫ్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సులువుగా. కొన్ని పదార్థాలు అందుబాటులో ఉంటే చాలు. కీళ్ల నొప్పులను త్వరగా తగ్గించే ఆయిల్ ని తయారు చేయొచ్చు. ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ తయారీకి ఏయే పదార్థాలు కావాలి. తయారీ విధానమేంటి. ఈ వివరాలు తెలుసుకుందాం.
బాడీలో ఇన్ ఫ్లమేషన్ పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అయితే ఈ సమస్య రావడానికి మరి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆర్త్రైటిస్ లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్లలో కీళ్ల నొప్పులు వేధిస్తాయి. ఏదైనా గాయాలైనప్పుడు కూడా ఇదే విధంగా ఎక్కువ రోజుల పాటు నొప్పులు వచ్చే అవకాశముంది. బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ తోనూ ఈ సమస్య తలెత్తుతుంది. ఈ కారణంగా వాపులు, నొప్పితో పాటు కొంత మందిలో జాయింట్స్ వద్ద చర్మం ఎరుపు ఎక్కడం, దురద రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాస్త నడిచినా వెంటనే విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది. దీని వల్ల పూర్తిగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మరి కొన్ని సమస్యలు వస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే జాయింట్స్ అన్నీ పట్టేసినట్టుగా అనిపిస్తాయి.
Comments
Post a Comment